top of page
Search
  • Writer's pictureసాహిత్య సదస్సులు

తెలుగు భాషాదినోత్సవం

Updated: Oct 12, 2020

నెల్లూరు నగరంలో దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల(స్వ.ప్ర)లో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడైన గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా తెలుగు భాషాదినోత్సవాన్ని కళాశాల తెలుగు శాఖ అంతర్జాల వేదికగా నిర్వహించింది. ఈ కార్య క్రమంలో ప్రధాన వక్త ఎమ్. ఎల్. సి విఠపు బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ సంగీతానికి అనువైన భాష తెలుగని , కొత్త పదజాలంతో పరిపుష్టమై, ఆధునిక శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకొని ముందుకు వెళుతుందని, ఈ సందర్భంగా ప్రపంచ భాషా సాహిత్యాన్ని తెలుగులో అనువదించుకుని తెలుగు భాషను మరింత సుసంపన్నం చేసుకోవాల్సిన అవసరం ఉందని, నూతన విద్యా విధానంలో మాతృభాషకు ప్రాధాన్యమివ్వడం సంతోషించే పరిణామమని చెప్తూ , కురుక్షేత్రంలో అభిమన్యుడిలా పోరాడిన గిడుగు గొప్పతనాన్ని కొనియాడారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.సి.హెచ్, మస్తానయ్య గారు. అమ్మలాంటి తెలుగుభాష గొప్ప దనాన్ని, వ్యావహారిక భాష ఆవశ్యకత ప్రాధాన్యతను వివరించారు. తెలుగు శాఖాద్యక్షులు డా.కె. కరుణశ్రీ గారు వ్యావహారిక భాషలో గ్రంథరచనకు, పాఠ్య బోధనకు చిత్తశుద్దితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు అంటూ వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపకులు డా. యస్. దివిజాదేవి , డా. జి. పద్మప్రియ, శ్రీ.ఎం. వెంకట్రావు, శ్రీ వెంకటేశ్వర్లు, నెల్లూరు జిల్లాలోని వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్ప క్రమంతో పాల్గొన్నారు.

విద్యార్థులు ధరణీ శివప్రియ, అనంతలక్ష్మి, శ్యామల, సౌజన్య తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని పాటలు, కవితలు, ప్రసంగాల రూపంలో వినిపించారు.






5 views0 comments
bottom of page