top of page
WhatsApp Image 2023-03-02 at 21.24.53.jpeg

​ఇదండీ నా పరిశోధన 

పురాణమిత్యేవ న సాధు సర్వం

నచాపి కావ్యం నవమిత్యవద్యం

సంతః పరీక్షాంతరాత్ భజంతే

           మూఢః పరప్రత్యయనేయ బుద్ధి:        

                                       -మహాకవి కాళిదాసు​

(ప్రాచీనమైనదంతా స్వీకరించదగింది కాదు. అలానే కొత్తదాన్ని తిరస్కరించటం లేదా ఉదాసీనంగా చూడటం సరైన పద్ధతి కాదు. వివేకవంతులు పరీక్షగా ఆలోచన చేసి ఏది ఉత్తమమైందో దానిపట్ల అభిమానాన్ని చూపిస్తారు. విచక్షణతో ఆలోచించని వ్యక్తులు ఇతరులు ఏం చెబితే అది నమ్ముతూ ఉంటారు.) 

​ఈ ప్రయాణం 

గమ్యం తెలియని, దారి లేని ఒక ప్రయాణం పరిశోధన. ఊహాజనిత గమ్యానికి దారుల్ని ఏర్పరచి, ఆ దారిలో ఉన్న పరిమళాల్ని హత్తుకొని, అడొచ్చిన కంటకాల్ని ఏరేస్తే చివరికి దొరికే అమృత ఫలమే పరిశోధన. పరిశోధన అంటేనే ఒక క్షీరసాగర మథనం. ఎన్నో విధాల పరిశీలన, ఎన్నోరకాల విశ్లేషణ, ఎన్నో రోజుల అన్వేషణ, మరెన్నో సంవత్సరాల నిరీక్షణ. వెరసి ఆ ఆలోచనామృతం సిద్ధాంత వ్యాసంగా మారుతుంది. ఒక చిన్న ఆలోచన అతి పెద్ద సిద్ధాంతంగా రూపుదిద్దుకునే క్రమంలో ఎన్ని సందేహాలు ఉద్భవిస్తాయో అన్ని సలహాలూ పలకరిస్తాయి. చివరికి పరిశోధకులు తమకు అందిన తీరాన్నో, కావలసిన తీరాన్నో చేరుకుంటారు. దానివలన డిగ్రీలు రావచ్చు. అవార్డులూ వరించవచ్చు. ఏది ఏమైనా పరిశోధన అంటేనే ఒక మహా ప్రయాణం. మన చుట్టూ ఎన్నో పరిశోధనలు. ఎన్నెన్నో ఆవిష్కరణలు. వాటన్నిటి గురించి అందరం చదివి తెలుసుకోవాలంటే వేల గంటలు ఖర్చు చేయాలి. కానీ అతి తక్కువ సమయంలో ఒక పరిశోధన గురించి మనం తెలుసుకోవాలంటే అది పరిశోధకుల మాటల్లోనే సాధ్యం. అందువలన పరిశోధనా ప్రస్థానాన్ని, ఆ ఫలితాన్ని, ఆ అనుభవాల్ని పంచుకోడానికి, పెంచుకోడానికి ఒక వేదిక ఉంటే బాగుంటుందని, పరిశోధనల సారాంశాన్ని పరిశోధకుల మాటల్లోనే వినగలిగితే ఇంకా బాగుంటుందనే ఆలోచనతో రూపుదిద్దుకున్న ప్రయాణమిది.

స్వర్ణోత్సవాల పరిశోధనా గ్రంథం 

ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారు ఆంధ్ర విశ్వవిద్యాలయ విశ్రాంతాచార్యులు. 50 సంవత్సరాల క్రితం వారు చేసిన పరిశోధనా గ్రంథమే..

ఆంధ్ర వాజ్ఞయము - రామాయణము 
భారతదేశ సమైక్యతకు రామాయణము చేసిన దోహద
ము

​ప్రారంభ కార్యక్రమం 

ఇదండీ నా పరిశోధన! (1)_page-0001.jpg

​తెలుగు పొడుపు కథలు 

ఆచార్య సి.నారాయణరెడ్డిగారి పర్యవేక్షణలో 

కసిరెడ్డి వెంకట రెడ్డిగారు చేసిన పరిశోధనా అనుభవాల సమాహారమిది.

 

వినాలనికున్నవారు కింది లింకులోకి వెళ్ళండి.

ఇదండీ నా పరిశోధన - 3_page-0001.jpg

శిల్ప ప్రభావతి 

​ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావుగారి మార్గదర్శకత్వంలో ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డిగారు ప్రభావతీ ప్రద్యుమ్నం గురించి చేసిన పరిశోధన ఇది.

ఇదండీ నా పరిశోధన - 4_page-0001.jpg

​కె. వి. ఆర్. సాహిత్య రచనలు సామాజిక, రాజకీయ విశ్లేషణ 

​ఆచార్య పి. సి. నరసింహారెడ్డి గారి నేతృత్వంలో డా.డి. లక్ష్మీ సుహాసినిగారు చేసిన పరిశోధన ఇది.

ఇదండీ నా పరిశోధన - 6_page-0001.jpg

తెలుగులో దేశిఛందస్సు 

ఆచార్య పి. యశోదా రెడ్డిగారి పర్యవేక్షణలో

డా. సంగన భట్ల నరసయ్య చేసిన సిద్ధాంత గ్రంథ విశ్లేషణ... 

ఇదండీ నా పరిశోధన_page-0001.jpg

​తిక్కన చేసిన మార్పులు ఔచిత్యపు తీర్పులు 

ఆచార్య జి. వి. సుబ్రహ్మణ్యంగారి పర్యవేక్షణలో ఆచార్య పి. సుమతీ నరేంద్రగారు సమర్పించిన సిద్ధాంత గ్రంథ విశ్లేషణ ఇది.  

​తెలుగు వ్యాస పరిణామం 

​ఆచార్య కోరాడ మహదేవ శాస్త్రిగారి పర్యవేక్షణలో ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు చేసిన 'తెలుగు వ్యాస పరిణామం' అనే సిద్ధాంత గ్రంథ విశ్లేషణ ఇది.

ఇదండీ నా పరిశోధన - 8_page-0001.jpg

​ఇదండీ నా పరిశోధన  

​నిర్వహణ 

డా. కె. కరుణశ్రీ 

తెలుగు అధ్యాపకులు 

డి. కె. ప్రభుత్వ మహిళా కళాశాల 

నెల్లూరు. 

డా. జి. పద్మప్రియ

​పి. ఆర్. ఆర్. & వి. ఎస్. ప్రభుత్వ కళాశాల 

విడవలూరు 

​నెల్లూరు జిల్లా 

​డా. ఎస్. ఎల్. వి. ఉమామహేశ్వర రావు 

తెలుగు అధ్యాపకులు 

జవహర్ నవోదయ విద్యాలయ్ 

కడపజిల్లా  

bottom of page