top of page
Search
  • Writer's pictureసాహిత్య సదస్సులు

సాహిత్యంలో మహమ్మారి (మొదటి అంతర్జాల సదస్సు)

Updated: Mar 21

సదస్సు ఉద్దేశ్యం


సాహిత్యం ఒక సాంత్వన. ఒక ఆలంబన. ఒక శక్తి. బాధల భారాన్ని దించి తీరానికి చేర్చే ఒక నావ. దానికి సాక్ష్యం యుగాల నుండి విపత్తుల కాలంలో సాహిత్యం మానవునికి ఊతగా నిలబడడమే. విపత్కర కాల పరిస్థితులను ఎదుర్కొని పోరాటపటిమను నరనరానా నింపుతూ మనిషి మనిషినీ మానసిక యుద్ధానికి సన్నద్ధం చేయడమే సాహిత్యం యొక్క పరమ ప్రయోజనం. ఔషధాలు భౌతిక జీవనానికి కావలసిన సామర్థ్యాన్ని అందిస్తే సాహిత్యం, సంగీతం మానసిక జీవనానికి అందవలసిన సంయమనాన్ని అందిస్తుంది. అది ఈ కరోనా కాలంలో స్పష్టంగా మన కళ్ళకు కనిపిస్తోంది. కనిపించని కరోనా వైరస్ ను సాహిత్యం కనుమరుగు చేయలేకపోయినా ఇలాంటి వైరస్లు ఎన్ని వచ్చినా ఎదుర్కొనే ధైర్యాన్ని గుండె నిండా నింపుతుంది. ఈ వైరస్ మనకి కొత్త కానీ కాలానికి కాదు. కాల ప్రవాహంలో ఇలాంటి ఎన్నో మహమ్మారులు మన తాత ముత్తాతలని పలకరించి ఉంటాయి. ఇవన్నీ సాహిత్యంలో ఎక్కడో ఒక చోట నిక్షిప్తమై ఉంటాయి. కాల పరీక్షకు నిలబడిన ఎందరో మహానుభావులు వాటిని గ్రంథస్తం చేసి ఉంటారు. అలాంటి మానవ ప్రగతి నిరోధకాలుగా నిలబడిన మహమ్మారుల గురించి ఒకసారి అవలోకనం చేసుకుని పాఠాలు నేర్చుకోవడమే ఈ సదస్సును ఉద్దేశ్యం ప్రయత్నం.




మానవ మనుగడను సందిగ్ధంలో పడేసిన మహమ్మారులలో కరోనా మొదటిదీ కాదు చివరిదీ కాదు. అంతే తీవ్రతతో విరుచుకుపడిన పాండమిక్స్ చరిత్రలో చాలా ఉన్నాయి. మహాభారతంలో పుట్టిన ముసలం యాదవ వంశాన్ని మొత్తం తుడిచి పెట్టింది. ఆ ముసలం ఆ కాలంలో ఒక వైరస్సే కావచ్చు. 1347-1351 మధ్య కాలంలో ఏడు కోట్ల మందిని తుడిచిపెట్టేసిన బ్లాక్ డెత్ అని పిలిచే ప్లేగు, ఇక ఆధునిక కాలంలో వందేళ్ల క్రితం 1918-1920 మధ్యలో రెండు కోట్ల మందిని హతమార్చిన స్పానిష్ ఫ్లూ వరకు మహమ్మారులు ఎన్నో. భూమ్మీద మనిషి ఆధిపత్యానికి సవాల్ ఈ వైరస్లే. ప్రకృతిలోని ప్రతి అంశాన్ని కవితా వస్తువుగా స్వీకరించే కవులు ఈమహమ్మారిని కూడా తమ కవిత్వ పుటల్లో ఎక్కడో పేర్చి ఉంటారు. ఆధునిక సాహిత్యం మొదలయ్యాక ప్రజలను ఇంతగా భయపెట్టిన మహమ్మారి కరోనాయే. కరోనా పట్ల ప్రజల్లో అవగాహనను కలిగించడానికి, భయాన్ని పారద్రోలడానికి, ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి తెలుగు కవులు చేస్తున్న కృషి ప్రశంసనీయం. ఇలాంటి కవిత్వాన్నంతా సమీక్షించడమే సదస్సు అంశం. జానపద సాహిత్యంలో కావచ్చు పురాణాలు ఇతిహాసాల్లో కావచ్చు ఏదైనా ఎక్కడైనా సాహిత్య పుటల్లోని మహమ్మారి చర్చనీయాంశమే.

ఉప అంశాలు

ప్రాచీన సాహిత్యంలో మహమ్మారి, జానపద సాహిత్యంలోని వివిధ రూపాల్లో మహమ్మారి,వివిధ కళారూపాల్లో మహమ్మారి,ఆధునిక సాహిత్య ప్రక్రియల్లో మహమ్మారి,అంతర్జాలంలోని వివిధ ప్రక్రియల్లో మహమ్మారి ,దృశ్యమాద్యమాల్లో మహమ్మారి, ఇతర భాషా సాహిత్యాల్లో మహమ్మారి,మహమ్మారి - సాహిత్య పరిష్కారాలు, మహమ్మారి అనంతర పరిస్థితులు,వివిధ సాహిత్య పోటీల్లో కథల్లో కవితల్లో పాటల్లో ఒగ్గు కథల్లో బుర్రకథలు హరికథలు మొదలైన వాటిల్లో మహమ్మారి.

పై సదాశయాలతో ఏర్పాటు చేయబడిన ఈ సదస్సు 2020 మే 21,22 తేదీలలో zoom app ద్వారా జరిగింది.అంతర్జాలంలో నిర్వహింపబడిన మొట్ట మొదటి జాతీయ సదస్సుగా ఈ సదస్సు విమర్శకుల చేత కొనియాడబడింది.ఈ సదస్సులో 80 మంది పాల్గన్నారు.53 మంది వివిధ కళాశాలల అధ్యాపకులు పత్రసమర్పణ చేశారు.




#BusinessPresentation #PublicSpeaking

16 views0 comments
bottom of page