top of page

దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల 1964 జూన్ 27వ తేదీ దొడ్ల సుబ్బారెడ్డి దాతృత్వ గుణంతో ఆయన సతీమణి పేరు మీదుగా నెల్లూరు నగర నడిబొడ్డున నిర్మించబడింది. ఈ కళాశాల నెల్లూరు జిల్లా మహిళలకే కాక ఇతర జిల్లాల మహిళలకూ విద్యనందించి వారిని సర్వతోముఖులుగా తీర్చిదిద్ది రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. డి.కె. ప్రభుత్వ మహిళా కళాశాల స్వయం ప్రతిపత్తి హోదాతో పాటు కాలేజ్ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్స్లెన్స్ ను సాధించి అగ్రగామిగా పయనిస్తోంది. ఈ కళాశాల అటు విద్యలో, ఇటు పరిశోధనా రంగంలో దినదిన ప్రవర్ధమానం అవుతూ ఇతర కళాశాలలకు మార్గదర్శకంగా ఉంది. ఈ కళాశాలలో తెలుగు అధ్యయన శాఖ కూడా కళాశాల స్థాపించిన నాటి నుంచి ఏర్పడి తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడుతూ విద్యార్థుల సాహితీ తృష్ణ తీరుస్తూ వారిని ఉపాధి దిశగా నడిపిస్తోంది. అలాంటి తెలుగు శాఖ ఇప్పుడు తెలుగు సాహిత్యంలో చర్చించవలసిన అనేక అంశాలను అందరితో పంచుకోడానికి దొడ్ల కౌసల్యమ్మ పేరు మీదుగా సాహితీ 'కౌసల్యం' అన్న సాహిత్య వేదిక ద్వారా సహృదయుల సౌజన్యంతో మీ ముందుకు వస్తోంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని భావిస్తూ క్రింది లంకెలో నమోదు చేయవలసినదిగా కోరుతున్నాను.

​                                ఈ క్రింది YouTube ఛానెల్లో ఈ వేదిక ద్వారా నిర్వహించే తెలుగు భాషా, సాహిత్యాలకు సంబంధించిన అన్ని కార్యక్రమలనూ వీక్షించవచ్చు. ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి తెలుగు భాషా, సాహిత్యాలను ప్రోత్సహించండి. ప్రస్తుతం ఈ ఛానెల్లో డిగ్రీ మొదటి సెమిస్టర్ కు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలూ ఉన్నాయి. మిగిలిన సెమిస్టర్లకు సంబంధించిన తెలుగు పాఠ్యాంశాలను కూడా త్వరలో వినవచ్చు.

సాహితీ 'కౌసల్యం'

సాహిత్య వేదిక 

దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల(స్వయం)

​మీ స్పందన 

​ధన్యవాదాలు 

సాహితీ కౌసల్యం - నిర్వహణ 

డా. కె. కరుణశ్రీ 

తెలుగు ఉపన్యాసకులు​ 

bottom of page